
చదువు కంటే పెళ్లిళ్లకే ప్రిఫరెన్స్
సిరా న్యూస్; మన దేశంలో చాలా మంది చదువుకన్నా పెళ్లిళ్లకే రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. వివాహం జీవితంలో ముఖ్యమైన ఘట్టమే. కానీ, కొంతకాలంగా దీనికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి మొదలు కుని పెళ్లి తర్వాత జరిగే వివిధ కార్యక్రమాల వరకు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెడుతున్నారు. మేరకు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తమ సర్వేలో గుర్తించింది. భారత వివాహ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేసింది. ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లి ఖర్చే ఎక్కువగా చేస్తున్నట్లు జెఫరీస్ వెల్లడించింది.భారత మార్కెట్లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతాయని సర్వే సంస్థ అంచనా వేసింది. చైనాలో 70 లక్షల నుంచి 80 లక్షల పెళ్లిళ్లు, అమెరికాలో 20 లక్షల నుంచి 25 లక్షల…
