
మాస్ మాధవి….
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గమే. ఎందుకంటే ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి. ఒకరు ముస్లింపార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తుండగా, ఆయనపై రూపంలోనూ, భాష్యంలోనూ హిందుత్వాన్ని కనపరుస్తున్న కొంపెల్ల మాధవీలత బీజేపీ నుంచి బరిలోకి దిగుతుంది. కొంపెల్ల మాధవీలత ఎంపికే అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలలో కూడా ఆమె ఎక్కడా కనపడలేదు. అసలు పార్టీ సభ్యత్వం ఉందో కూడా తెలీని పరిస్థితుల్లో కొంపెల్ల మాధవీలతను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.కొంపెల్ల మాధవీలత ఎంపిక ఆషామాషీగా జరగలేదు. ఆమె హైదరాబాద్ లో పేరెన్నికగన్న విరంచి ఆసుపత్రి అధినేత సతీమణి. డబ్బుకు కొదవలేదు. మంచి మాటకారి. మొన్నటి వరకూ…
