
గిరిప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు
సిరా న్యూస్,విశాఖపట్టణం; జులై నెలలో ఆషాడ పౌర్ణమి రోజున సింహాచలంలో గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించనున్నారు. సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకన చేరుకుంటారు.గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేస్తుంది. జులై 20వ తేదీన సాయంత్రం 4.00 గంటలకు కొండ దిగువన తొలిపావంచా (కొండ ఎక్కే మొదటి మెట్టు) వద్ద నుంచి పుష్ప రథం ప్రారంభం అవుతుంది. జులై 21న తుది విడత చందన సమర్పణ జరుగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా జులై 20న రాత్రి 10.00 గంటల వరకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది. జులై 21న విజయోత్సవం…
