
మల్కాజ్ గిరిలో భారీగా నామినేషన్లు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఒక ఘట్టం ముగిసింది.ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు సమయం ఉంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.. మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా 1,488 నామినేషన్లు వచ్చాయి. ఇక తెలంగాణలోని 17 స్థానాల్లో ప్రస్తుతం 9 బీఆర్‌ఎస్ ఖాతాలో ఉండగా, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎ 1 స్థానంలో గెలిచాయి.ఇదిలా ఉంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కాంగ్రెస్ 2019లో తెలంగాణలో గెలిచిన మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. రేవంత్ పోటీ చేసిన మల్కాజ్‌గిరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలిచిన నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన భువనగిరి స్థానాలకు వారు రాజీనామా చేశారు. ముగ్గురూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరుగుతున్న లోక్‌సభ…
