
గురుకుల పాఠశాలలో వృధా నీరు రాకుండా చర్యలు
మిషన్ భగీరథ సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాలి అదనపు నీటిని వన్యప్రాణుల కోసం కేటాయించేందుకు ప్రణాళిక షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" కమ్మదనం గురుకుల పాఠశాలతో పాటు మిషన్ భగీరథ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే సిరా న్యూస్,షాద్ నగర్; మిషన్ భగీరథ వృధా నీటితో పాటు వర్షాలు పడ్డ సమయంలో వస్తున్న ప్రవాహంతో కమ్మదనం గురుకుల పాఠశాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అలా జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకుంటామని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యాలత తదితర విద్యార్థులు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ వెంటనే స్పందించారు. మంగళవారం స్థానిక కమ్మదనం గురుకుల పాఠశాలను అలాగే భగీరథ వాటర్ ప్లాంట్ ను సందర్శించారు.…
