ఆరోగ్యం

Medical Camp: పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం…

సిరా న్యూస్, దస్తురాబాద్:  పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం... వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులకు హిమోగ్లోబిన్, ఇతర టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More
21 Dec 2023, 5:19 pmsiranews.in