తాజా వార్తలు

Medical officer Kiran: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:  వైద్యాధికారి కిరణ్

సిరాన్యూస్‌, ఇచ్చోడ‌ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:  వైద్యాధికారి కిరణ్ * ఇస్లాంపూర కాలనీలో ఉచిత వైద్య శిబిరం సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇచ్చోడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిరణ్ అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ‌ మండల కేంద్రంలోని ఇస్లాంపూర కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసంద‌ర్బంగా ఈ వైద్య శిబిరంలో మధుమేహం, అధిక రక్త పోటు, జ్వర పీడుతులకు సంబంధించిన వాటిపై ఇతర వ్యాధులకు సంబంధించిన నలభై మూడు మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ జ్వర బాధితుల రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి కిరణ్ మాట్లాడుతూ వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.…

Read More
19 Aug 2024, 6:12 pm
Updated: 19 Aug 2024, 6:12 pm
siranews.in