
పవన్ కు మద్దతుగా మెగా ఫ్యాన్స్….
సిరా న్యూస్,హైదరాబాద్; పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారా? పిఠాపురం వస్తారా? అందులో నిజం ఎంత? అదంతా ఉత్త ప్రచారమేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసారి చట్టసభల్లో అడుగు పెట్టాలని బలంగా డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని గుణపాఠంగా తీసుకున్నారు. పిఠాపురం నుంచి లక్ష కోట్ల మెజారిటీతో గెలవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆ మూడు పార్టీలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. అటు సర్వేలు సైతం పవన్ కళ్యాణ్ 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నాయి. అయితే ఎలాగైనా లక్ష ఓట్ల మెజారిటీ దాటాలని.. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని జన సైనికులు భావిస్తున్నారు.ఇప్పటికే జనసేన స్టార్ క్యాంపెయినర్లు పిఠాపురంలో రంగంలోకి దిగారు. బుల్లితెర నటులతో పాటు జబర్దస్త్ కళాకారులు పెద్ద…
