Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 10 August 2024, 6:46 pmEditor : SIRA NEWS
Minister Ponnam Prabhakar: ఫామ్ ఆయిల్ పంటతో అధిక లాభాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

సిరాన్యూస్,సైదాపూర్:
ఫామ్ ఆయిల్ పంటతో అధిక లాభాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
* సైదాపూర్‌లో వ్యవసాయ అవగాహన సదస్సు
ఫామ్ ఆయిల్ పంటల ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సైదాపూర్ మండలలో కేంద్రంలో రైతువేదికలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ పంటలు కాకుండా ఆదాయం వచ్చే మామిడి, మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్, ఫామ్ ఆయిల్ పంటల ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు. రైతలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
