Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 January 2024, 12:23 pmEditor : Sira News

Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ హయాంలోనే సొసైటీల బలోపేతం

సిరా న్యూస్.చిగురుమామిడి

కాంగ్రెస్ హయాంలోనే సొసైటీల బలోపేతం…

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నే సొసైటీ బలోపేతానికి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని రాష్ట రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో అలీగ్ అండ్ శ్రమజీవి కోపరేటివ్ స్టోర్ 51 వ వార్షికోత్సవ స్వర్ణోత్సవాల సందర్భంగా నూతనంగా నిర్మించిన గోదాములను మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ప్రతీ రైతు సహకార సంఘం సభ్యుడు కావాలని రైతులను కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వరరావు, జెడ్పీటీసీ గీకురు రవీందర్, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.