ప్రముఖ వార్తలు

Minister Ponnam Prabhakar: బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

సిరాన్యూస్, భీమదేవరపల్లి బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ * మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన గ్రామ‌స్తులు భీమదేవరపల్లి మండ‌లంలోని గట్ల నర్సింగాపూర్, రసూల్ పల్లి గ్రామాల‌కు బ‌స్సు ర‌వాణా సౌకర్యం క‌ల్పించాల‌ని విద్యార్థులు, గ్రామ‌స్థులుమంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు విన్న‌వించారు. వెంట‌నే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్క‌డి నుంచే ఆర్టీసి ఆధికారుల‌తో మాట్లాడి బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేర‌కు ఆదివారం నుంచి బ‌స్సు సౌక‌ర్యాన్ని ప్రారంభించారు. మంగ‌ళ‌వారం గట్ల నర్సింగాపూర్, రసూల్ పల్లి గ్రామస్తులు బస్సుకు పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు, అభిమానులు, పాల్గొన్నారు.

Read More
25 Jun 2024, 10:51 amsiranews.in