
Minister Ponnam Prabhakar: రాష్రానికి పెట్టుబడులు వస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్
సిరాన్యూస్,భీమదేవరపల్లి రాష్రానికి పెట్టుబడులు వస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుంటే బిఆర్ఎస్ నాయకులకు కండ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నత అధికారులతో కలిసి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే, బిఆర్ఎస్ నాయకులు నాయకులు ముఖ్యమంత్రి కుటుంబ పరమైన అంశాలను తీసుకువచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పది ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ఒక్కసారి కూడా విదేశాలకు వెళ్లలేదని, ఈ విషయమై బిఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బిఆర్ఎస్ అనుకూల పత్రికలో సుంకిశాల గోడ విరిగిపడిందని దానితో లింకు…
