
కోహెడ మండలం శనిగరం చెరువును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,కోహెడ; మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం శనిగరం చెరువును పరిశీలించారు. చెరువులో గంగమ్మ కి పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి, హాస్టల్ లోకి వస్తుందని తెలిపారు. గుట్ట నుండి వచ్చే నీటిని ప్రోక్లెయిన్ ద్వారా డ్రెయిన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం బీసీ హాస్టల్ ను సందర్శించారు. వారికి అందుతున్న ఆహారం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో బోర్ కావాలని, టాయిలెట్స్ ఇబ్బంది ఉందన్న సిబ్బంది వెంటనే అధికారులతో మాట్లాడి హాస్టల్ లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తంగలపల్లి లో డబుల్ రోడ్డు పనులకు విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ కోసం ఇప్పటికే 5 లక్షలు…
