Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 1 November 2024, 5:24 pmEditor : Sira News
పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

సిరా న్యూస్,హైదరాబాద్;
పత్తి కొనుగోళ్ళ ఏర్పాట్ల పై సచివాలయంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు మరియు అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మార్కెట్ కు మరియు జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేల ఏర్పాట్లు చేయాలి. వాట్స్ యాప్ సేవల (8897281111) ద్వారా వెయిటింగ్ టైమ్, పేమెంట్ స్టేటస్,కంప్లయింట్ ఫోరం, ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలి. జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు.
అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు, సిసిఐ అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతు తీసుకువచ్చిన పంటలు తడవకుండా కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలి. పత్తి కొనుగోళ్ళ విషయములో అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
