
వైసీపీ ట్రబుల్ షూటర్ గా మిధున్ రెడ్డి
సిరా న్యూస్,విజయవాడ; సీపీలో మార్పు ఎఫెక్ట్ ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపుతుందో గాని.. ప్రస్తుతం పార్టీలో ఎంపీ మిథున్‌రెడ్డి పాత్రను కీలకంగా మార్చేసింది. తనకు అప్పగించిన రెండు జిల్లాలు.. తన తండ్రి, మంత్రి పెద్దిరెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న రెండు జిల్లాల బాధ్యతలను చూస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేల మార్పుచేర్పుల వ్యవహారంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీలో ఎవరినోట విన్నా మిథున్‌రెడ్డి పేరే వినిపిస్తోంది.అధికార వైసీపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎవరి నోట విన్నా.. ఎంపీ మిథున్‌రెడ్డి కోసమే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల మార్పు నిర్ణయాన్ని సీఎం జగన్ కంటే ముందుగా.. ఎంపీ మిథున్‌రెడ్డే తెలియజేస్తుండటం.. అసంతృప్తులు, అసమ్మతులు పెద్దవి కాకుండా చూసుకోవడం ఎంపీ మిథున్‌రెడ్డి పనిగా మారడంతో పార్టీలో క్రియాలశీలకంగా మారారు.ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్‌రెడ్డి తొలి నుంచి సీఎం జగన్‌కు అత్యంత…
