Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 16 February 2024, 1:49 pmEditor : SIRA NEWS

MLA Anil Jadhav: సహకార సంఘాన్ని వినియోగించుకోవాలి

సిరా న్యూస్, ఇచ్చోడ‌
సహకార సంఘాన్ని వినియోగించుకోవాలి
* బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* ప్రాథమిక వ్యవసాయ భవనం ప్రారంభం

రైతులు సహకార సంఘాన్ని వినియోగించుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.  శుక్ర‌వారం ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక గంగారెడ్డి గార్డెన్ పక్కన నిర్మించిన నూతన వ్యవసాయ సహకార సంఘం భవనాన్నిబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు.  ఈసంద‌ర్భంగా ఎంఎల్ ఏ మాట్లాడుతూ రైతులకు ఈ సహకార సంఘాన్ని వినియోగించుకోవాలని అన్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు నెలలు గడిచినా రైతుల రైతు బందు ఇంకా అందలేదని అన్నారు . ప్రభుత్వం రైతు బందు డబ్బులు సకాలంలో అందించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మండల బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.