MLA Kavvampally Satyanarayana: సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డ‌కుండా చ‌ర్య‌లు : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

సిరాన్యూస్, తిమ్మాపూర్:
సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డ‌కుండా చ‌ర్య‌లు : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
* పంచాయతీ కార్యదర్శులతో ప్ర‌త్యేక స‌మావేశం

ప్ర‌జ‌లు సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగ‌ళ‌వారం తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ ప్రజాభవన్ కార్యాలయంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులతో అయన పలుకీలక అంశాలను చర్చించారు. గ్రామాలోని ప్రజలు సీజనల్ విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు చేపట్టవలసిన కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు. కార్య‌క్ర‌మంలో అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *