
ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్….ఎన్నికల నిబంధనలకు నూరు శాతం అనుగుణంగా ఖచ్చితంగా ఉంది
వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు సిరా న్యూస్,గుడివాడ; పూర్తి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారంగానే.... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని తన నామినేషన్ ధ్రువపత్రాలను సమర్పించారని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు అన్నారు. గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో కొడాలి నాని నామినేషన్ రాద్ధాంతం పై.... మండలి హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మండలి హనుమంతరావు మాట్లాడుతూ అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లు.... టిడిపి నేతలు రాద్ధాంతం చేశారు. ఎన్నికలకు ముందే ఓటమి భయంతో.... టిడిపి వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారు.కొడాలి నాని నామినేషన్ చేల్లదంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం.కనీసం ఎన్నికల నిబంధనలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన లేనివారు.... నామినేషన్ వేసిన తర్వాత వారిలో జ్ఞానం కలిగించాలని కాండేట్ హెల్ప్ హ్యాండ్ బుక్ ఇస్తారు. కనీసం దానిలో…
