
MLA Sigudu Vamsikrishna: కలెక్టర్, అధికారులపై దాడి అమానుషం :ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
సిరాన్యూస్,ఆదిలాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి అమానుషం :ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ * ఇది ముమ్మాటికీ మాజీ సీఎం, మంత్రులు,ఎమ్మెల్యేల పనే యువతకు ఉపాధి కల్పించాలని మహోన్నతమైన లక్ష్యంతో ప్రజల అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అదనపు కలెక్టర్, తాసిల్దార్ లపై జరిగిన దాడి ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డిల పనే అని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు బయలుదేరుతున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే చెక్కుల రాజేష్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ని ఓ గ్రామంలో…
