ఆంధ్రప్రదేశ్

MLA Srinivasulu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్ గా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్ గా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా సేవలందించారు. విప్ల ఎంపికైనందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read More
13 Nov 2024, 2:18 pm
Updated: 13 Nov 2024, 2:31 pm
siranews.in