Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 3 April 2024, 8:50 pmEditor : SIRA NEWS

MLA Vedma Bojju: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్

సిరా న్యూస్, ఇంద్రవెల్లి:

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మసూద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ జహీర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్ధానిక జామా మజీద్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఖర్జూరాలు తిని ఉపవాస దీక్షలను విరమించారు. అనంతరం ముస్లిం నాయకులు ఎమ్మెల్యేతో కలిసి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.