తెలంగాణ

MLA Visit – బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

సిరా న్యూస్, లోకేశ్వరం: బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ బాధిత కుటుంబాలను ముథోల్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ పరామర్శించారు. లోకేశ్వరం మండలం గడ్‌చందా గ్రామంలో బీజేపీ కార్యకర్త డి.దేవేందర్‌ మాతృమూర్తి, అలాగే కాసు సంతోష్‌ తండ్రి ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం వారి నివాసాలకు వెళ్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
25 Dec 2023, 6:10 pmsiranews.in