
తెలంగాణ నుంచి మోడీ, సోనియా పోటీ…?
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత… రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయిందా? బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను కాదని… కాంగ్రెస్, బీజేపీలు నువ్వా? నేనా? అంటూ తలపడబోతున్నాయా? నయానయా స్కెచ్చులతో ఈ రెండు నేషనల్ పార్టీస్ దూసుకొస్తుండటం చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. గత పదేళ్లుగా తెలంగాణలో గులాబీ గుబాళిస్తే… ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు.. బీఆర్‌ఎస్‌ను సైడ్ చేసేసి, బస్తీమే సవాల్ అనుకుంటున్నాయి. దేనికదే ఖతర్నాక్ ప్లాన్‌తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్‌లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రంనుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్‌ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. అందుకే, సోనియాను.. తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. దీనిపై…
