
డీఎస్సీ కీపై 28 వేలకుపైగా అభ్యంతరాలు
సిరా న్యూస్,హైదరాబాద్; త్వరలోనే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్షలు పూర్తి అయిన కొద్దిరోజుల్లోనే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై అభ్యంతరాలను స్వీకరించే గడువు కూడా ఆగస్టు 20వ తేదీతో పూర్తి అయింది. అయితే డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'పై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యర్థుల నుంచి 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. ఆన్ లైన్ ద్వారా స్వీకరించిన ఈ అభ్యంతరాలను పరిశీలించే పనిలో విద్యాశాఖ ఉంది. ఈ ప్రక్రియను అంతా కూడా త్వరితగతిన పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో కొన్ని ప్రశ్నలకు సంబంధించే ఎక్కువ అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది.డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ 'కీ' లను ఈనెలాఖారులోనే…
