Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 15 February 2024, 12:48 pmEditor : SIRA NEWS

MP Thalari Rangiah:స్వయం సహాయక సంఘాల అభివృద్దికి ప్ర‌భుత్వం కృషి

సిరా న్యూస్ ,కుందుర్పి

స్వయం సహాయక సంఘాల అభివృద్దికి ప్ర‌భుత్వం కృషి
* ఎంపీ తలారి రంగయ్య
* స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్‌లు అంద‌జేత‌
* వైయస్సార్ ఆసరా నాలుగవ విడత సంబరాలు

స్వయం సహాయక సంఘాల అభివృద్దికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని అనంతపురం పార్లమెంట్ సభ్యులు,  కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా. తలారి రంగయ్య అన్నారు.  గురువారం కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వై.ఎస్.ఆర్ ఆసరా నాలుగవ విడత సంబరాల కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ తలారి రంగయ్య స్వయం సహాయక సంఘాలకు మెగా చెక్ ను అంద‌జేశారు.  అనంత‌రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం సంధర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు.  అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంబదూరు మండలం పరిధిలోని తిప్పేపల్లి,  నూతిమడుగు గ్రామాలలో పార్టీ నేతలు,కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ తిప్పేస్వామి , మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాలు చందన శివాజీ,  దురదకుంట దొణస్వామి, తిమ్మరాయుడు బాబు రెడ్డి , గోవిందు గొల్ల సూరి భీమేష్ , రేవన్న గౌడ్ ఫణి కంబదూరు నారప్ప,  వైయస్సార్సీపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.