తాజా వార్తలు

Mpdo Ravindranath: ఖాప్రి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అధికారులు

సిరా న్యూస్ జైనథ్: ఖాప్రి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అధికారులు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఖాప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో రవీంద్ర నాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొని ఉన్న పలు సమస్యల గురించి ఆరా తీశారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్య, తరగతి గదుల కొరత, తదితర అంశాలను గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఏల్మ సుజాత, ఏఈ ప్రభాకర్, ఏపిఎం భగవాన్లు, వివో ఏ రామన్న, నాయకులు ఎల్టి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

Read More
3 Apr 2024, 8:37 pmsiranews.in