సిరాన్యూస్,సామర్లకోట
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : ఎంపీడీఓ శ్రీలలిత
ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ శ్రీలలిత అన్నారు. మంగళవారం సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామ పంచాయితీ లో సర్పంచ్ నాగమణి అధ్యక్షతన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీలలిత హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్బంగా పారిశుధ్య సిబ్బందికి సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నాయకులు, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది, గ్రామ ప్రజలు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.