
Municipal Chairman Jogu Premender: పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
సిరాన్యూస్, ఆదిలాబాద్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ * ఘనంగా గాంధీజికి నివాళి గాంధీజీ జీవిత పాఠం అహింసా తో పాటు పరిశుభ్రత వంటి అంశాలను నిత్య జీవిత సత్యాలుగా మలిచిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. మొదట గాంధీ చౌక్ లో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని గాంధీజీకి పాలాభిషేక తో పాటు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ పార్క్ లో గాంధీజీకి పూలమాలు వేసే నివాళులు అర్పించి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు మున్సిపల్ కార్మికులను ఘనంగా సత్కరించారు అలాగే ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం పరిసర ప్రాంతాల్లో చీపురు చేతపట్టి…
