Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 25 September 2024, 8:12 pmEditor : SIRA NEWS

Municipal Chairman Rajura Satyam: అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో చేతి పంపు ఏర్పాటు : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో చేతి పంపు ఏర్పాటు : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాన‌ని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. బుధ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం అంబేద్కర్ నగర్ కొత్త కాలనీలో చేతి పంపును మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ఏర్పాటు చేయించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడ‌తూ ప్రజలు తాగు నీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక కౌన్సిలర్ తెలియజేయడంతో ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ సహకారంతో చేతి పంపును ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, నాయకులు జన్నరపు శంకర్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , నాయకులు కాలనీవాసులు మేదరి రాజేశ్వర్,గొర్రె గంగాధర్, మంగుడి సురేష్,దాసరి రాజేశ్వర్,చెట్టు పెళ్లి మోహన్,మగ్గిడి రెడ్డి,దాసరి సురేందర్, మంగిడి నారాయణ,రాగం సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.