తాజా వార్తలు

Municipal Chairman Rajura Satyam: మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్ మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వార్డు శాంతినగర్ కాలనీలో శుక్ర‌వారం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు రాజేందర్, శేషాద్రి, చింత పండు రవి, కడుకుంట్ల రవి,రమేష్, రాము,కిషోర్, మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, మెప్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
27 Sep 2024, 5:08 pmsiranews.in