
Municipal Chairman Rajura Satyam: భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
సిరాన్యూస్, ఖానాపూర్ భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం 11వ వార్డు విద్యానగర్ కాలనీలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయస్సులోనే భగత్ సింగ్ తన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టారని అన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భగత్ సింగ్ ఇచ్చిన నినాదం ఇప్పటికీ వేల గొంతుల స్వరంగా మారు మోగుతోందని వారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎనగందుల నారాయణ,పడాల ప్రభాకర్,చరణ్, భగత్ సింగ్ యూత్ సభ్యులు…
