
Munigela Yogita Sridhar: మానసిక ప్రశాంతత కోసమే యోగా: మునిగెల యోగిత శ్రీధర్
సిరాన్యూస్, ఆదిలాబాద్ మానసిక ప్రశాంతత కోసమే యోగా: మునిగెల యోగిత శ్రీధర్ మానసిక ప్రశాంతత కోసమే యోగా అని మునిగెల యోగిత శ్రీధర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆమె మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన సనాతనమైన అభ్యాసమని తెలిపారు. వెలకట్టలేని అత్యద్భుతమైన ఈ' యోగ' అభ్యాసం ఆదియోగి అయినటువంటి మహాశివుడు పతంజలి మహర్షిని నిమిత్తంగా చేసుకొని మానవవాళికి అందించిన మహోన్నతమైన వరం. భౌతికంగా, మానసికంగా ధృఢంగా చేసే ప్రక్రియ యోగా. యోగా వలన ఎన్నెన్నో లాభాలు భౌతికంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నాయి. నేటి కాలంలో హడావిడి జీవితంలో మనస్సుని, ఆత్మని,బుద్ధిని స్థిరం చేసే ఏకైక ఆయుధం యోగా ఆత్మని అనగా జీవాత్మను పరమాత్మ తో జోడించబడే మార్గ నిర్దేశకం ఈ యోగా తెలిపారు. మానసిక వికాసానికి అయిన బుద్ధి వికాసానికి అయిన తనను…
