
మున్నూరు కాపులు సమాజానికి దిక్సూచిగా నిలవాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరా న్యూస్,పెద్దపల్లి; మున్నూరు కాపులు సమాజానికి దిక్సూచిగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బందంపల్లిలో ఆదివారం మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల్లో విభేదాలు ఉన్నా పార్టీలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మున్నూరు కాపులు మరింత బలోపేతం చెందాలని ఆకాంక్షించారు. కాపు కులాన్ని పటిష్ఠం చేస్తూ ఇతర కులాల ఆదరణ పొందడం ద్వారా రాజకీయంగా పరింత రానించవచ్చని అభిప్రాయం వ్యక్తం…
