
తెలుగు జాతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
సిరా న్యూస్; నందమూరి రామకృష్ణ తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ అందరికీ శుభ దినం మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్నడు కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరూ ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు కదలి వచ్చారు. అలా కదిలి వచ్చిన తెలుగు జాతికి, తెలుగు యువతకి, తెలుగు మహిళలకు, ఓటరు మహాశయులు అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు…
