
విలన్ పాత్రలో నాగ్…
సిరా న్యూస్,హైదరాబాద్; తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం హీరోలలో టాలీవుడ్ కి నాలుగు స్తంభాలుగా నిల్చిన సూపర్ స్టార్స్ లో ఒకరు అక్కినేని నాగార్జున. నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున, తన తండ్రిలాగా కాకుండా, తనకి నచ్చిన దారిలో వెళ్తూ, అశేష ప్రేక్షాభిమానం పొంది టాప్ 4 స్టార్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. ఫ్యామిలీ హీరో గా, క్లాస్ హీరో గా, రొమాంటిక్ హీరో గా, మాస్ హీరో గా, భక్తుడిగా ఇలా ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలలో కనిపించిన నాగార్జున, పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అంతం’ చిత్రం లో నెగటివ్ షేడ్ రోల్ లో కనిపించాడు కానీ, అది పూర్తి స్థాయి కాదు.…
