తాజా వార్తలు

నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

డ్యామ్‌ 13వ గేట్‌ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్న ఆంధ్రా పోలీసులు సిరా న్యూస్,నాగార్జున సాగర్‌ ; నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్‌ 13వ గేట్‌ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదలచేసుకున్నది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్‌ స్టోరేజీకి చేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, డ్యామ్‌కు ఇరువైపులా ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశం…

Read More
1 Dec 2023, 8:21 pmsiranews.in