Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 October 2024, 7:26 pmEditor : SIRA NEWS

Nagunuri Srinivas : గీత కార్మికుడు నగునూరి శ్రీనివాస్ గౌడ్‌కు గాయాలు

సిరాన్యూస్, ఓదెల
గీత కార్మికుడు నగునూరి శ్రీనివాస్ గౌడ్‌కు గాయాలు

పెద్దపల్లి ఓదెల మండలం పోత్కపల్లి లో ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి గాయాలయ్యాయి. పోత్కపల్లి గ్రామానికి చెందిన నగునూరి శ్రీనివాస్ గౌడ్ అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా ఈత చెట్టు ఎక్కి గీస్తుండగా మోకు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ నడుం బాగం లో గాయాలు కాగా ప్రమాదం గమనించిన తోటి గీతా కార్మికులు 108 కు సమాచారం అందించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రభుత్వం స్పందించి వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించి గీతా కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని గౌడ సంఘం నాయకులు సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఓదెల మండలం అద్యక్షుడు నల్లగోని వెంకటేష్ గౌడ్ కోరారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.