
నల్లమిల్లి కంటితడి..
సిరా న్యూస్,రాజమండ్రి; న్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తు నేపథ్యంలో టిక్కెట్ దక్కని పలువురు కీలక నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు. బుధవారం బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి అభ్యర్థిగా బీజేపీ నేత శివకృష్ణంరాజును ప్రకటించింది. దీంతో ఇక్కడ టిక్కెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఓ దశలో ఆయన కార్యకర్తల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. వాస్తవానికి, పొత్తులకు ముందు అనపర్తి స్థానాన్ని టీడీపీ నల్లమిల్లి కృష్ణారెడ్డికే కేటాయించింది. అయితే, మారిన రాజకీయ పరిణామాలు, పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి కేటాయించారు. అయితే, తనకు అధిష్టానం టిక్కెట్ కేటాయించక పోవడంపై ప్రజల్లోకే వెళ్లి తేల్చుకుంటానని నల్లమిల్లి స్పష్టం చేశారు. 'నాకు…
