
నర్సన్నపేట.. టఫ్ ఫైట్…
సిరా న్యూస్,శ్రీకాకుళం; శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఐదోసారి విజయం కోసం ధర్మాన కృష్ణ దాస్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బగ్గు రమణమూర్తిపై కృష్ణదాస్ 19వేల ఓట్లతో గెలిచారు. 2014లో టీడీపీ తరపున గెలుపొందిన రమణ మూర్తి 2019లో ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున ధర్మాన, టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి పోటీ చేస్తున్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నరసన్న పేటకు జగన్ హామీలు: నరసన్నపేట టౌన్ పరిధిలో ఆర్అండ్ బీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కు రూ.10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మధ్యలోనే నిలిచిపోయిన విస్తరణ పనులకు మరో రూ.10కోట్లు అవసరమని ఆర్అం డ్ బీ శాఖ అధికారులు ప్రతిపాదించారు. సీఎం నిధులు ప్రకటించినా ఇంతవరకు రూపాయి మంజూరు కాలేదు. మడపాం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.15 కోట్ల…
