తాజా వార్తలు

ఆగస్టు 11న నీట్ పీజీ ఆన్ లైన్ టెస్ట్

సిరా న్యూస్,న్యూడిల్లీ; దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్‌-పీజీ పరీక్షను NBE వాయిదే వేసిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.. పరీక్షకు కొన్ని గంటల ముందు నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ క్యాన్సిల్‌ చేసింది. నీట్ యూజీ 2024, యూజీసీ నెట్‌ 2024 పరీక్షల పేపర్‌ లీకేజీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెల్పింది. అయితే తాజాగా నీట్‌ పీజీ పరీక్ష కొత్త తేదీలను NBE ప్రకటించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయించింది. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష…

Read More
6 Jul 2024, 11:14 amsiranews.in