
New cybercrime : సరికొత్త సైబర్ క్రైమ్
సిరా న్యూస్,హైదరాబాద్; ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గతంలో లాటరీ, లక్కీ డ్రా, గిఫ్ట్‌లు, క్రెడిట్ కార్డుల పేరుతో ప్రజలను దోచుకునేవారు. ఇప్పుడు తాజాగా కొత్త పంధా ఎన్నుకున్నారు. తెలంగాణ ‘ప్రజాపాలన’ దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాలోని డబ్బులు కాజేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త ప్లాన్ వేశారు.దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90 శాతం మంది మహిళలు ఉండటంతో కాల్ చేసి నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోయిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజాపాలన’లో డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన లావణ్య…
