
తెలంగాణకు కొత్త రైల్వే లైన్
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో కొత్త రైల్వే లైను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఒడిసాలోని మల్కన్ గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఈ రైల్వే లైను నిర్మాణం కొనసాగుతుంది. మొత్తం 290 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒడిసా, తెలంగాణ, ఏపీ, జార్కండ్, చత్తీస్ గడ్ ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ, సరకు రవాణాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రాజెక్టుగా ఇది రూపుదాల్చనుంది. రూ.7383 కోట్లతో ఈ లైను నిర్మించేందకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు కూడా దీనివల్ల అత్యధిక ప్రాధాన్యం దక్కబోతోంది. 34 వంతెనలు వస్తాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానం చేయడంతోపాటు మహానది కోల్డ్ ఫీల్డ్ నుంచి దక్షిణ భారతదేశంలోని విద్యుత్తు తయారీ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను వేగంగా చేయడానికి మార్గం సుగమం అవుతుంది.…
