
చారిత్రాత్మక భవనాలకు కొత్త హంగులు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద పీట వేయనుందా ? ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఏంటి ? సంక్షేమం, అభివృద్ధిని రేవంత్ సర్కార్ జోడు ఏడ్లుగా పరుగులు పెట్టిస్తోందా ? ఈ జాబితాలో టూరిజం రంగాన్ని సైతం చేర్చనుందా అని అంటే మాత్రం సమాధానం అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చారిత్రాత్మక భవనాలకు తాము ప్రయారిటీ ఇస్తామంటున్నారు ప్రభుత్వాధినేత.హైదరాబాద్ మహానగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు.హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణలో భాగం కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని సైతం…
