తాజా వార్తలు

యూనివర్శిటీలకు కొత్త వీసీలు

 సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలోని యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతుల నియామకానికి మార్గం సుగమమైంది. నియామకాలకు సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 23న సంతకం చేశారు. ఈ ఫైల్‌ విద్యాశాఖకు చేరడంతో.. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను సెర్చ్‌ కమిటీ పరిశీలనకు పంపిస్తారు. ఈ సెర్చ్‌ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఎంపికచేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్‌ ఆమోదించిన తర్వాత.. వీసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. మే నెలాఖరునాటికి ఈ ప్రక్రియంతా పూర్తిచేసి.. పాత వీసీలు వైదొలగగానే కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ,…

Read More
25 Jan 2024, 4:24 pmsiranews.in