
పాలకులకేమో నూతన సంవత్సర వేడుకలు- మాకేమో ఆకలి కేకలా.
21వ రోజు సమ్మెలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీలు రాష్ట్ర తెలుగుదేశం మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ సిరా న్యూస్,బద్వేలు; అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె 21వ రోజు లో భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని (సిడిపిఓ) కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సిఐటియు) బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలియజేశారు.21 రోజు సమ్మెకు తెలుగుదేశం మహిళ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, మున్సిపాలిటీ నాయకురాలు ఆదిలక్ష్మి,13వ వార్డు టిడిపి కౌన్సిలర్ షేక్ మహమ్మద్ హసన్,34వ వార్డు కౌన్సిలర్, టిడిపి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మిత్తి కాయల సునీత లు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ....…
