Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 5 March 2024, 8:17 pmEditor : SIRA NEWS

Nominated posts:నామినేటెడ్ పదవులలో మహిళలకు అవకాశం దక్కేనా ?

సిరాన్యూస్‌, ఖానాపూర్
   నామినేటెడ్ పదవులలో మహిళలకు అవకాశం దక్కేనా ?
నియోజకవర్గం మ‌హిళ‌ల అభ్య‌ర్థులు ప‌దవుల‌పై ఆశ‌
మ‌హిళ‌లు అన్ని రంగ‌ల్లో రాణిస్తున్నా… రాజ‌కీయాల్లో మాత్రం రానివ్వ‌డం లేదు. గ‌త మూడు దశాబ్దాల తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్ట పడ్డ మహిళా కార్య కర్తల ను పార్టీ గుర్తించి వారికి అవకాశం కల్పిస్తారని మహిళ కార్యకర్తలు ఆశిస్తున్నారు, గత ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఎన్నో పోరాటాలు చేసి వారి పెట్టే కేసులను ఎదుర్కొని పురుష నాయకులతో సమానం గా పార్టీ కోసం కష్ట పడ్డ మహిళ కార్యకర్తలను గుర్తిస్తే ప్రజలలో మంచి సంకేతం వెళ్ళడమే కాకుండా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వుంటుంది అని కార్యకర్తలు అనుకుంటున్నారు,అదే విధంగా ఏ టువంటి అసంతృప్తి వచ్చే అవకాశం ఉండదు అని చర్చించు కొంటున్నారు, ఇదే విషయం గూర్చి ఖానాపూర్ ఎమ్మెల్యే అది వాసి ముద్దు బిడ్డ ఎమ్మెల్యే వేడ్మా భొజ్జు పటేల్కి కలిసి తమకు అవకాశం కల్పించాలని కొంత మంది మహిళా నాయకులు విన్నవించినట్లు తెలిసింది,తమకు తప్పక అవకాశం వస్తుంది అని వారుచర్చికుంటున్నారు,ఇప్పటి వరకు నియోజక వర్గంలో మహిళల కు ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు ఈ సారైనా ఆ అవకాశం వస్తుందో లేదో చూడాలి?!

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.