తాజా వార్తలు

దేవరపై ఆగని ట్రోలింగ్..

సిరా న్యూస్,హైదరాబాద్; : దేవర.. జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ అయి వ్యూస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగానే ఎన్టీఆర్‌ మూవీ అంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్‌పై రియాక్షన్స్‌ ఏంటి?ఎక్కడో కొడుతుంది శీనా.. ఏంటి ఈ వెటకారం అనుకుంటున్నారా? దేవర ట్రైలర్‌ చూసిన వారంతా లోలోపల ఎక్కడో అనుకుంటున్న మాట ఇది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి విపరీతమైన ట్రోలింగ్‌ మొదలైంది. ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది ఈ పాన్‌ ఇండియా మూవీ. వీఎఫ్‌ఎక్స్‌ బాలేదంటారు కొందరు. ఆంధ్రావాల టూ అంటారు మరికొందరు. అసలు ఎన్టీఆర్‌ లుకే బాగాలేదంటారు ఇంకొందరు. పాటలు కాపీ అంటారు.. డాన్స్‌ స్టెప్స్‌ కూడా కాపీ అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు ఫిల్మ్స్‌ సర్కిల్‌లో…

Read More
23 Sep 2024, 11:37 amsiranews.in