తాజా వార్తలు

కోటీశ్వరులే కాదు సామాన్యులు…

సిరా న్యూస్,విజయవాడ; ఎన్నికలంటే కోట్ల రూపాయల ఖర్చు... అసలు సామాన్యులెవ్వరూ ఆ వైపు ఆలోచించనుకూడా లేరు... సాధారణంగా అందరికీ కలిగే అభిప్రాయం ఇది. ప్రస్తుత ఎన్నికల్లో కొందరి ఆస్తుల వివరాలు చూస్తే ఆ విషయం నిజమే అనే భావన కలుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఆర్ధికంగా బలవంతులకే టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే కొందరు సామాన్యులూ ఈ సార్వత్రిక సమరానకి సై అంటున్నారు. కొంత ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది నిజం. వారు సమర్పించిన అఫిడవిట్లు అందుకు సాక్ష్యం.కోట్లల్లో స్థిరాస్తులు, అంతకు మించి చరాస్తులు... ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల అర్హతగా మారిపోయింది. కానీ బ్యాంకు ఖాతాలో కనీసం నాలుగంకెల బ్యాలెన్స్ కూడా లేని వ్యక్తులు కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో అధికార వైసీపీ తరపున పోటీలో దిగి తమ అదృష్టాన్ని…

Read More
27 Apr 2024, 10:35 amsiranews.in