
ఇక పవర్ ప్లాంట్లపై గురి
ఒప్పందాలపై బహిరంగ ప్రకటన సిరా న్యూస్,ఖమ్మం; బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, చత్తీస్గడ్ నుంచి విద్యుత్ ఒప్పందాలపై దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నెలలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా, విచారణలో భాగంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, చత్తీస్గడ్ విద్యుత్ ఒప్పందాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే పది రోజుల్లో అందించాలని ప్రకటనలో పేర్కొన్నారు.మణుగూరు సమీపంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించడానికి అత్యంత ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీని వినియోగించారని, రెండేళ్ల కాలం వ్యవధి సరిపోతుండగా.. దాన్ని అధిక మూల వ్యయంతో ఎక్కువ కాలం అంటే 7…
