సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో రెండు ఎకరాల మామిడి తోట దగ్ధం
రెండు ఎకరాల మామిడి తోట దగ్ధమైన సంఘటన పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఈదుకుంట వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల మండల కేంద్రంలోని ఈదుకుంట వద్ద రైతు అల్లం సతీష్ ఐదు ఎకరాల మామిడి తోటను పెంచుతున్నాడు. శుక్రవారం ప్రమాదవశాత్తు మామిడి తోటకు నిప్పంటుకుంది. గమనించిన స్థానికులు పెద్దపల్లి నుండి ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే రెండు ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. రైతుకు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు కన్నీరుమున్నీరయ్యారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.